News February 6, 2025

సిరిసిల్ల: చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా గోనె ఎల్లప్ప

image

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా సిరిసిల్ల పట్టణానికి చెందిన గోనె ఎల్లప్పను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ గురువారం తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. చేనేత రంగానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.

Similar News

News February 6, 2025

మహాకుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్య క్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. దేవస్థానంలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేకం మహోత్సవాల రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్‌ను గురువారం ఆయన ప్రకటించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

News February 6, 2025

మంత్రి ఫరూక్‌కు 1st ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నంద్యాల జిల్లా మంత్రులు ఫరూక్ 1, బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

News February 6, 2025

TG భరత్‌కు 15వ ర్యాంకు

image

మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత డిసెంబర్ వరకు ఫైళ్లను త్వరగా క్లియర్ చేసిన వారికి మెరుగైన ర్యాంకు లభించింది. ఈక్రమంలో కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్‌‌కు 15వ ర్యాంకు లభించింది. నంద్యాలకు చెందిన ఫరూక్‌కు మొదటి ర్యాంకు, బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు లభించింది.

error: Content is protected !!