News April 5, 2025
సిరిసిల్ల: జగ్జీవన్ రామ్ జీవితం తరతరాలకు స్ఫూర్తి: రామదాసు

బాబు జగ్జీవన్ రామ్ జీవితం తరతరాలకు స్ఫూర్తి అని బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ జె.రామదాసు అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి సర్దాపూర్‌లోని పోలీస్ బెటాలియన్‌లో జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ.. దేశంలో హరిత విప్లవం, వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. ఆర్ఐలు ఉన్నారు.
Similar News
News February 25, 2026
AI పుణ్యమా అని పెరిగిన ఆదాయం!

AI వల్ల 40%కి పైగా భారతీయ ఉద్యోగుల ఆదాయం పెరిగిందని బ్యాంక్‌బజార్ నివేదిక వెల్లడించింది. 22-45 ఏళ్ల మధ్య వయస్సు గల శాలరీడ్‌లో ఈ మార్పు కనిపిస్తోంది. అయితే ఐదుగురిలో ఒకరు AI వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భారతీయులు మొదటి ప్రాధాన్యం ఆరోగ్యానికి ఇస్తుండగా.. తర్వాత సొంత ఇల్లు, పిల్లల చదువును కీలకంగా భావిస్తున్నారు.
News February 25, 2026
వనపర్తి: అత్యాచార నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

వనపర్తిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు పక్కా సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. బాధితురాలికి న్యాయం జరిగినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 25, 2026
T20 WC: పాక్ సెమీస్ చేరాలంటే..

T20 WCలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన పాక్‌కు సెమీస్ చేరడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది శ్రీలంకపై పాక్ కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్‌ను శ్రీలంక, ఇంగ్లాండ్ ఓడించాలి. అప్పుడు పాక్ మూడు పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఇక రెండోది న్యూజిలాండ్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిస్తే శ్రీలంకపై పాక్ భారీ తేడాతో గెలిచి కివీస్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాలి.


