News August 23, 2025
సిరిసిల్ల: జలాశయాల్లో స్థిరమైన నీటిమట్టం

అప్పర్, మిడ్ మానేరు జలాశయాల్లో స్థిరమైన నీటిమట్టం ఉందని అధికారులు శనివారం తెలిపారు. అప్పర్ మనేరు ప్రాజెక్ట్‌లో నీటిమట్టం 1482.45 అడుగుల వద్ద నిల్వ ఉంది. సామర్థ్యం 1.99 TMCలుగా నమోదైంది. ప్రవాహం లేదని, RMC ద్వారా 70 క్యూసెక్కుల విడుదల కొనసాగుతుంది. మిడ్ మనేరు రిజర్వాయర్‌లో 313.62 మీటర్ల వద్ద 17.605 TMCలు నిల్వ కాగా, సగటు ఇన్‌ఫ్లోలు 19,896 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లోలు 7,940 క్యూసెక్కులుగా నమోదైంది.
Similar News
News March 15, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో గత వారం KG స్కిన్ లెస్ ₹290-300 ఉండగా, ఇవాళ రూ.350 వరకు అమ్ముతున్నారు. APలోని పలు ప్రాంతాల్లో ₹315-320గా ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతి తగ్గడం, ఎండ వేడికి కోళ్లు చనిపోతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయికి చికెన్ రేటు చేరడం ఇదే తొలిసారని వ్యాపారులు అంటున్నారు.
News March 15, 2026
సరదా కోసం మరోసారి దాడి చేస్తాం: ట్రంప్

ఇరాన్‌లోని <<19378419>>ఖర్గ్<<>> ద్వీపంపై కేవలం ఫన్ కోసమే తాము మరిన్ని దాడులు చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ తమతో డీల్‌కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ కండీషన్లే సరిగ్గా లేవని విమర్శించారు. ‘ఖర్గ్‌లోని చాలా భాగాన్ని పూర్తిగా నాశనం చేశాం. మేం వినోదం కోసం మళ్లీ అటాక్స్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ బతికే ఉన్నారా’ అని ప్రశ్నించారు.
News March 15, 2026
విశాఖలో చికెన్ రూ.310

విశాఖలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.170, స్కిన్ లెస్ రూ.310, విత్ స్కిన్ రూ.320, శొంఠ్యాం కోడి రూ.340గా కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మటన్ కేజీ రూ.1000. డజన్ గుడ్లు రూ.60 పలుకుతున్నాయి. చేపలు, రొయ్యల అమ్మకాలు అప్పుఘర్, ఫిషింగ్ హార్బర్, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, తదితర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.


