News November 27, 2025

సిరిసిల్ల: ‘జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలి’

image

ఆరోగ్య పథకాలు 100% సాధించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో ఆరోగ్య పథకాలపై అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పథకాలు సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకృష్ణ, అనిత, నహిమ, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 27, 2025

విద్యార్థులకు మెరుగైన బోధన చెయ్యాలి: PDPL కలెక్టర్

image

విద్యార్థులకు మెరుగైన బోధన కోసం చర్యలు చేపట్టాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, ప్రత్యేక తరగతుల నిర్వహణ, పాఠ్యాంశాల విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 85 ఉన్నత పాఠశాలల్లో ఫలితాలను మెరుగుపరిచే విధంగా పర్యవేక్షించాలన్నారు.

News November 27, 2025

MPల సమావేశంలో పెద్దపల్లి MPవంశీ కృష్ణ

image

HYD తెలంగాణ ప్రజా భవన్‌లో రాష్ట్ర MPల సమావేశంలో పెద్దపల్లి MPగడ్డం వంశీ కృష్ణ పాల్గొని పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక మద్దతు, సాగు- తాగునీరు ప్రాజెక్టులు, ఎనర్జీ సెక్యూరిటీ, జాతీయ మౌలిక వసతులు, ఉపాధి, ప్రజా ఆరోగ్యం, విద్య- సామాజిక న్యాయంపై చర్చించారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, రాష్ట్ర హక్కులపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రస్తావించారు.

News November 27, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం..

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దేవరకొండ: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
చండూరు: వృథాగా కృష్ణా జలాలు
నల్గొండ: రేపటితో ముగిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నల్గొండ: కోడి ధరను దాటేసిన చిక్కుడుకాయ
నల్గొండ: స్థానికంపై ఆ మూడు పార్టీల కన్ను
కట్టంగూరు: అభ్యర్ధులకు ఎస్సై సూచన
కట్టంగూరు: రెండు సార్లు ఆయనే విన్
మునుగోడు: ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి