News January 27, 2025
సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మిడియట్ పరీక్షలు రాసేవారు 9,310

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులు 5,065 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 4,245 మంది సెకండ్ విద్యార్థులు మొత్తం కలిపి 9,310 మంది పరీక్షలు రాస్తారని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 5, 2025
చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జట్టు ఇదే..!

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక సదుంలో బుధవారం జరిగింది. ధరణీధర, బాలాజీ, భరత్ కుమార్, మహేంద్ర, సుధీర్(సదుం), వెంకటేశ్, ప్రసన్నకుమార్, ప్రిన్స్ (నిండ్ర), సతీష్(పలమనేరు), హర్షవర్ధన్(ఏఎన్ కుంట), నిఖిల్(దిగువమాఘం), ప్రవీణ్ కుమార్ (చిత్తూరు), సుశీల్ (సిద్ధంపల్లె), గోకుల్(అరగొండ), ప్రవీణ్ కుమార్ నాయక్(పీలేరు) ఎంపికైనట్లు నిర్వాహకులు చెప్పారు.
News November 5, 2025
‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్ల దోపిడీ.. చివరికి..

థ్రిల్లర్ సిరీస్ ‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్లు దోచుకుంది ఢిల్లీకి చెందిన గ్యాంగ్. నిందితులు అర్పిత్(ప్రొఫెసర్), ప్రభాత్(అమాండా), అబ్బాస్(ఫ్రెడ్డీ) తమ పేర్లను సిరీస్‌లో మాదిరి మార్చుకున్నారు. SMలో పలు గ్రూపులు ఏర్పాటు చేసి స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చారు. తర్వాత హై రిటర్న్స్ ఇస్తామని నమ్మించి ₹కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 2 రాష్ట్రాల్లో దాడులు చేసి వారిని పట్టుకున్నారు.
News November 5, 2025
హాస్టల్ ఘటనపై తిరుపతి కలెక్టర్ సీరియస్

తిరుపతి వెల్ఫేర్ హాస్టల్ <<18201992>>ఘటనలో <<>>వాచ్‌మెన్ హరి గోపాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఇప్పటికే అతడిని సస్పెండ్ చేయగా.. ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ముని శంకర్ పర్యవేక్షణ లోపం ఉండటంతో ఆయనను సైతం సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్యామసుందర్ రావుకు ఛార్జ్ మెమో జారీ చేశారు.


