News March 26, 2025

సిరిసిల్ల జిల్లాలో ఎక్కువైన ఎండ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండ ఎక్కువైందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రోజు ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 39.0°c, కోనరావుపేట 38.9°c, రుద్రంగి 38.5°c, సిరిసిల్ల 38.4°c, °c,తంగళ్ళపల్లి తంగళ్లపల్లి 37.8°c, వేములవాడ 37.2°c, ఎల్లారెడ్డిపేట 37.2°c,లుగా నమోదు అయ్యాయి. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు సూచనలు జాగ్రత్తగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News December 10, 2025

కామారెడ్డి: డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్

image

కామారెడ్డిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

News December 10, 2025

రంగారెడ్డి జిల్లా మహిళలకు ఫ్రీ టైలరింగ్‌

image

SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ చిలుకూరులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహిళలకు వసతి, భోజనం సౌకర్యంతో టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణాకాలం 30 రోజులు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు గురువారం సంస్థ కార్యాలయంలో గానీ లేదా ఫోన్ నం.85001 65190 ద్వారా పేరును నమోదు చేసుకోవాలని సంస్థ సంచాలకుడు మహమ్మద్ అలీఖాన్ సూచించారు.

News December 10, 2025

వయ్యారిభామ అతి వ్యాప్తికి కారణమేంటి?

image

ఒక వయ్యారిభామ మొక్క 10 నుంచి 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలు చాలా చిన్నవిగా ఉండి గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి అక్కడ మొలకెత్తుతాయి. అధిక విత్తన ఉత్పత్తి, విత్తన వ్యాప్తి, పశువులు తినలేకపోవడం ఈ మొక్కల వ్యాప్తికి ప్రధాన కారణం. వయ్యారిభామ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని, జూన్-జులైలో వర్షాల సమయంలో వృద్ధి చెంది, పొలాల్లో ప్రధాన పంటలతో పోటీ పడతాయి.