News February 5, 2025
సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ మహాసభలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ,ఉపాధ్యక్షుడు రాకేశ్, కళ్యాణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 28, 2026
అమిత్ షాతో పవన్ భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. ఉప్పాడ తీరంలో గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులనూ పవన్ కలిశారు. కాసేపట్లో విశాఖకు బయల్దేరనున్నారు.
News January 28, 2026
ANU: ఏం ఫార్మసీ రెగ్యులర్ పరీక్ష ఫలితాల విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్ నెలలో జరిగిన ఏం ఫార్మసీ రెగ్యులర్ ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. III, IV, సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చూడాలన్నారు.
News January 28, 2026
అర్థవీడులో అధికారుల దాడులు

అర్థవీడులో మల్లికార్జునరావు ట్రేడర్స్‌లో ఒంగోలు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా లైసెన్స్‌లను, స్టాక్ రిజిస్టర్ బిల్ బుక్స్‌ను పరిశీలించారు. ఈ తనిఖీలు స్టాక్ రిజిస్టర్ నందు, ఈపాస్ మెషిన్ నందు స్టాకు వ్యత్యాసం ఉన్నందున రూ.4,31108 ఎరువులను అమ్మకపు నిలుపుదల చేయడం జరిగిందన్నారు.


