News March 21, 2025

సిరిసిల్ల జిల్లాలో చల్లబడ్డ వాతావరణం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శుక్రవారం పలు మండలాలలో వాతావరణం చల్లబడింది. గడిచిన 24 గంటల్లోనే ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 37.7°c, గంభీరావుపేట 37.5°c, ఇల్లంతకుంట 37.1°c, చందుర్తి 37.1°c, రుద్రంగి 37.2°c, తంగళ్ళపల్లి 37.1°c కొనరావుపేట 36.9°c, బోయిన్పల్లి 36.0°c, తంగళ్ళపల్లి 37.1°c, ముస్తాబాద్ 35.9°c, లుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Similar News

News March 28, 2025

నితిన్ ‘రాబిన్‌హుడ్’ రివ్యూ&రేటింగ్

image

అనాథలను ఆదుకునేందుకు హీరో దొంగగా మారడమే రాబిన్‌హుడ్ స్టోరీ. నితిన్, శ్రీలీల నటన బాగుంది. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ కామెడీ వర్కౌట్ అయింది. చివర్లో ట్విస్టులు లేకపోవడంతో సినిమాను రక్తి కట్టించలేకపోయారు డైరెక్టర్ వెంకీ. మొదట్లో పవర్‌ఫుల్‌గా కనిపించే విలన్ క్యారెక్టర్ చివర్లో తేలిపోతుంది. పార్ట్-2 కోసమే డేవిడ్ వార్నర్‌ పాత్రను క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. సాంగ్స్ మైనస్.
రేటింగ్- 2.5/5

News March 28, 2025

అమెరికాలో జనసేన ఆత్మీయ సమావేశం

image

అమెరికాలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ పాల్గొన్నారు. జనసేన పార్టీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీగా 100% స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిందన్నారు. వివిధ రంగాల్లో ఉన్న మేధావులు పార్టీ కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్డీఏ కూటమి బలోపేతానికి ఎన్ఆర్ఐ‌లు సహకారం అందించాలని కోరారు.

News March 28, 2025

ఎటపాక : రోడ్డుపై శవాన్ని వదిలి పరుగులు

image

తేనెటీగలు దాడి చేయడంతో శవాన్ని రోడ్డు మీదే వదిలేసి పరారైన ఘటన ఎటపాకలోని గౌరీదేవి పేట గ్రామంలో శుక్రవారం జరిగింది. గౌరీదేవిపేట గ్రామంలో చనిపోయిన మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకొస్తుండగా.. దారి మధ్యలో తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో నడిరోడ్డు మీద శవాన్ని వదిలేసి ప్రజలంతా తలోదిక్కుకి పరుగులు పెట్టారు. 

error: Content is protected !!