News July 7, 2025
సిరిసిల్ల: జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

సిరిసిల్ల జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి 3.2, చందుర్తి 14.6, వేములవాడ రూరల్ 17.6, బోయినపల్లి 17.6, వేములవాడ 9.4, సిరిసిల్ల 18.1, కోనరావుపేట 12.3, వీర్నపల్లి 9.3, ఎల్లారెడ్డిపేట 27.7, గంభీరావుపేట 20.4, ముస్తాబాద్ 21.2, తంగళ్ళపల్లి 39, ఇల్లంతకుంట 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మొత్తం జిల్లాలో ఆవరేజ్ గా 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Similar News
News July 7, 2025
ప్రకాశం: కార్లు అప్పగించలేదంటూ SPకి ఫిర్యాదు.!

మూడు కార్లను బాడుగకు తీసుకొని 7 నెలలుగా బాడుగ డబ్బులు చెల్లించడం లేదని ఓ వ్యక్తి సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒంగోలు మారుతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మూడు కార్లను బాడుగకు మరో వ్యక్తికి అప్పగించాడు. 7 నెలలు పూర్తైనా ఇప్పటివరకు బాడుగ చెల్లించలేదు. అంతేకాకుండా కార్లను అప్పగించకపోవడంతో బాధితుడు, జిల్లా ఎస్పీ దామోదర్‌ను ఆశ్రయించారు. విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించారు.
News July 7, 2025
రాజమండ్రి: పీజీఆర్ఎస్‌కు 35 అర్జీలు

రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 35 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వాటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, దొంగతనం కేసులు, ఇతర కేసులకు సంబంధించిన అర్జీలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
News July 7, 2025
ఉమ్మడి KNR జిల్లా కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా అద్దంకి దయాకర్

ఉమ్మడి జిల్లాలకు కాంగ్రెస్ ఇంఛార్జ్‌లను TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి KNR జిల్లాకు ఇంఛార్జిగా అద్దంకి దయాకర్‌ను నియమించారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, స్థానిక రాజకీయాల్లో చైతన్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అద్దంకి దయాకర్ ప్రస్తుతం MLCగా కొనసాగుతున్నారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణను చూసి ఈ బాధ్యతను అప్పగించారు.