News December 17, 2025
సిరిసిల్ల: జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో 76 శాతం, వీర్నపల్లిలో 81.89 శాతం, ముస్తాబాద్లో 78.37 శాతం, గంభీరావుపేటలో 73.08 శాతం పోలింగ్ నమోదయింది. 1,25,324 మంది ఓటర్లకు గాను 95,736 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 76.39 శాతం పోలింగ్ నమోదయింది.
Similar News
News December 22, 2025
నేడు నెక్లెస్ రోడ్డులో ‘మాక్ డ్రిల్’

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా సోమవారం నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విపత్తు వేళ వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
News December 22, 2025
యోగాతో ఒత్తిడి, మానసిక సమస్యలకు చెక్

యోగాతో మానసిక సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే చేసే యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తే లంగ్స్ హెల్తీగా ఉంటాయి. యోగా చేస్తే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కోపం, ఆందోళన కంట్రోల్ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. చిన్న వయసు నుంచే యోగా నేర్పిస్తే పిల్లలకు ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
News December 22, 2025
నాపై 109 కేసులున్నాయి కాబట్టే..: సంజయ్

ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల తనపై 109 కేసులు పెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షాను అడిగారని గుర్తు చేశారు. ‘అందుకే సంజయ్ కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అయ్యారు’ అని షా బదులిచ్చారని పేర్కొన్నారు. వైద్యులు ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.


