News January 1, 2026
సిరిసిల్ల: ‘జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు’

జిల్లాలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం వచ్చే నెల రోజులలో జిల్లా పరిధిలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిషేధమని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News January 1, 2026
RR : రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాస వేడుకలకు సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల మొత్తం జిల్లాలో రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ RTA – DTC, MVIలు, AMVIలు, EE R&B బృందంతో పాటు, మహేశ్వరం DCP, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ బృందం CI తదితరులు పాల్గొంటారని తెలిపారు.
News January 1, 2026
నిర్మల్: స్కాలర్ షిప్ దరఖాస్తు తేదీ పొడిగింపు

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఇంటర్, డిగ్రీ, సాధారణ వృత్తి నైపుణ్య కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తు తేదీ పొడిగించినట్లు ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి దయానంద్ తెలిపారు. దరఖాస్తు గడువు మార్చి 31, 2026 వరకు పొడిగించామన్నారు. విద్యార్థులు www.telangana.epass వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 1, 2026
భీమవరం: కేంద్ర మంత్రి వర్మకు న్యూఇయర్ శుభాకాంక్షలు

కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గురువారం ఆయన కార్యాలయంలో పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పలు ప్రజాహిత అంశాలపై వారు చర్చించారు.


