News February 11, 2026
సిరిసిల్ల జిల్లాలో మున్సిపాలిటీల పోలింగ్ శాతం వివరాలు

సిరిసిల్ల మున్సిపాలిటీలో సాయంత్రం ఐదు గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 39 వార్డులలో 81,959 మంది ఓటర్లకు గాను 63,562 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేములవాడ మున్సిపాలిటీలో సాయంత్రం 5 గంటల వరకు 77.99 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 28 వార్డుల్లో 40,877 మంది ఓటర్లకు గాను 31,881 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News February 12, 2026
జీ.మాడుగుల మండలంలో పర్యటించిన కలెక్టర్

జీ.మాడుగుల మండలంలో బుధవారం కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న కుంబిడిసింగి బ్రిడ్జి, బొయితిలి నుంచి గున్నలోవ మధ్య 15 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీటీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. నుర్మతి నుంచి గొడ్డుబుసలు మధ్య నరేగా నిధులతో 1.6 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీటీ రోడ్డును పరిశీలించారు. రోడ్ల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
News February 12, 2026
రేపు YCP శాసనసభాపక్ష సమావేశం

AP: వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో రేపు ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు MLA, MLCలతో ఆయన భేటీ కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ వారితో చర్చించనున్నట్లు YCP ట్వీట్ చేసింది. ఇవాళ జగన్‌తో పాటు అసెంబ్లీకి వెళ్లిన వైసీపీ సభ్యులు కొంతసేపటికే సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
News February 12, 2026
పాడేరు: ‘గ్యాప్ ఏరియాకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి’

చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గ్యాప్ ఏరియాకు సంబంధించిన రెవెన్యూ, ఫారెస్ట్ భూములను తహశీల్దార్లు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి మండలాల్లో జరుగుతున్న రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియపై సమావేశమై మాట్లాడారు. పెండింగ్లో ఉన్న మ్యూటేషన్లు పూర్తి చేయాలన్నారు.


