News February 9, 2025

సిరిసిల్ల జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

image

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.

Similar News

News March 30, 2026

HYD: రేషన్ కార్డుల్లో మన మూడు జిల్లాలే TOP

image

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక- ఆర్థిక సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్యలో HYD మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 8,39,625 మందికి రేషన్ కార్డులు ఉన్నట్లు వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో RR జిల్లాలో 6.53 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 6.41 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. రికార్డులను పరిశీలిస్తే.. BPL కింద ఉన్నవారు, మన జిల్లాలోనే అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

News March 30, 2026

ADB: అదుపు తప్పితే ఆటో.. ఇటో.. ఎటో..!

image

రహదారిపై యమపాశంలా ఆ ద్విచక్ర వాహనం సాగిపోతోంది. ఆసిఫాబాద్ నుంచి కెరమెరి వెళ్లే దారిలో భారీ ప్లాస్టిక్ డబ్బాలను ద్విచక్ర వాహనం వెనుక కట్టుకుని ప్రయాణిస్తున్న దృశ్యం కలకలం రేపింది. ఇలాంటి మితిమీరిన లోడుతో బ్యాలెన్స్ తప్పితే ప్రాణాపాయం ఖాయం. వెనక నుంచి వచ్చే వాహనాలు కనిపించక పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రోడ్డు భద్రతా నిబంధనలు గాలికొదిలేస్తున్న ఈ ‘లోడ్’ ప్రయాణాలు ప్రయాణికులకు శాపంగా మారుతున్నాయి.

News March 30, 2026

కోమటిరెడ్డి బ్రదర్స్ కొత్త రాజకీయ వ్యూహం!

image

నల్గొండ జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులు తమ నియోజకవర్గాలను మార్చుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నకిరేకల్ జనరల్ స్థానంగా మారే అవకాశం ఉంటుందన్న చర్చ నేపథ్యంలో అక్కడి నుంచి వెంకటరెడ్డి, చౌటుప్పల్ నియోజకవర్గంగా ఏర్పడితే రాజగోపాల్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.