News September 10, 2025
సిరిసిల్ల: జిల్లాలో 10,234 ఇండ్ల మంజూరు

చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 10,234 ఇండ్లను మంజూరు చేయగా 5,301 మార్కింగ్ జరిగాయన్నారు. 3,230 బేస్మెంట్ స్థాయికి, 192 గోడల దశకు, 643 రూఫ్ వరకు, ఒక ఇల్లు పూర్తైందన్నారు.
Similar News
News September 10, 2025
సిద్దిపేట: RMPల వద్దకు వెళ్లకుండా చూడాలి: DMHO

ప్రజలు ప్రైవేట్ ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని DMHO డాక్టర్ ధనరాజ్ సూచించారు. బుధవారం తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తిమ్మాపూర్, అనంతసాగర్‌లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును సందర్శించారు. ఆరోగ్య సమస్యల పై ముఖ్యంగా ఫీవర్ కేసుల గురించి రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. జ్వరంతో వచ్చిన వారికి రక్త నమూనాలను సేకరించాలన్నారు.
News September 10, 2025
ఆన్‌లైన్ అడ్మిషన్లకు రెండు రోజులు అవకాశం: డీఐఈవో

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ ఇంటర్ అడ్మిషన్లకు రెండు రోజులు చివరి అవకాశం కల్పించనున్నట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు ఆగస్టు 31తో చివరి అవకాశం ముగిసినప్పటికీ పలువురు విద్యార్థుల అడ్మిషన్ పెండింగ్ ఉందన్నారు. దీంతో ఈనెల 11, 12న అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
News September 10, 2025
జూబ్లీహిల్స్‌లో BRS గెలిస్తే ప్రభుత్వం మారదు: పొన్నం

TG: ఇళ్ల కూల్చివేతపై <<17666775>>కేటీఆర్<<>> మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేళ్లు పాలించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా కట్టించారా అని ప్రశ్నించారు. గతంలో ఉపఎన్నికల్లో రూ.కోట్ల డబ్బులు, లిక్కర్ సీసాలు బీఆర్ఎస్ పంచిందని ఫైరయ్యారు. జూబ్లీహిల్స్‌లో BRS గెలిచినంతా మాత్రాన ప్రభుత్వం మారదన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయనివాడు జూబ్లీహిల్స్‌కు ఏం చేస్తాడని దుయ్యబట్టారు.