News March 3, 2026

సిరిసిల్ల: జిల్లా ఎస్పీని కలిసిన వేములవాడ డీఎస్పీ

image

వేములవాడ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు జిల్లా ఎస్పీ మహేష్ బి గితేను మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయనకు సూచించారు.

Similar News

News March 3, 2026

NLG: ‘పాలనలో వేగం పెంచాలి’.. కలెక్టర్ల సదస్సులో CM

image

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు అత్యంత కీలకంగా సాగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ పాల్గొని జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ​ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని CM ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

News March 3, 2026

యాదాద్రి: ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం

image

ఉరి వేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైరు ఈశ్వర్ గౌడ్(31) తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 3, 2026

సంపాదనలో కొంచెమైనా దాచుకోండి: పరుచూరి

image

ప్రస్తుత కాలంలో చాలామంది వృథా ఖర్చులతో డబ్బును సేవ్ చేసుకోవట్లేదు. ఈక్రమంలో దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గుండు సూదితో భూమిని సేద్యం చేయాలనుకోవడం ఎంత కష్టమో.. సంపాదించిన డబ్బును ఖర్చు చేయడం చేతిలో నీళ్లు నేలపై ఒలికించినంత తేలిక. అందుకే సంపాదనలో కొంచెమైనా దాచుకోవడం మంచిది. ఆ పొదుపే మీ వృద్ధాప్యంలో కామధేనువులా అండగా ఉంటుందని తెలుసుకోండి’ అని చెప్పుకొచ్చారు.