News February 25, 2026

సిరిసిల్ల: జిల్లా పోలీసులకు బంగారు పతకాలు

image

సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 8 పతకాలు (4-బంగారు, 4-కాంస్య) సాధించడం పట్ల జిల్లా ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు.

Similar News

News February 27, 2026

బాపులపాడు డిప్యూటీ ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు

image

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాపులపాడు మండల డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. లక్ష్మయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను వసూళ్లలో పురోగతి సాధించకపోవడం, సమీక్షా సమావేశాలకు గైర్హాజరు అవుతుండటం, OHSR ట్యాంక్‌లను పరిశుభ్రపర్చడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓను సస్పెండ్ చేశారు.

News February 27, 2026

ASF: సృజనకు బ్రెయిన్ డెడ్.. నలుగురికి కొత్త జీవితం

image

ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఈస్త సృజన(34) అవయవాలను దానం చేసి నలుగురికి జీవితం ప్రసాదించారు బాధిత కుటుంబీకులు. తల్లిదండ్రుల ఇంట్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సృజన ICUలో చికిత్స పొందినా ప్రాణం దక్కలేదు. భర్త నాగరాజు అంగీకరించడంతో కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి అవసరంలో ఉన్నవారికి అమర్చారు. సృజన మృతితో గ్రామం కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబాన్ని అభినందించింది.