News April 5, 2025

సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేశ్ గీతే  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు. 

Similar News

News January 2, 2026

భద్రకాళి ఆలయంలో సినీ హీరోయిన్‌

image

చారిత్రక భద్రకాళి ఆలయాన్ని సినీ హీరోయిన్‌ డింపుల్‌ హయాతి సందర్శించారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్ర బృందంతో కలిసి వచ్చిన ఆమె, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు ఆమెను ఆశీర్వదించారు. షూటింగ్‌ విశేషాలను పంచుకున్న ఆమెతో ఫొటోలు దిగేందుకు స్థానికులు, భక్తులు ఆసక్తి చూపారు.

News January 2, 2026

నెల రోజులపాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు: సూర్యాపేట ఎస్పీ

image

జిల్లా వ్యాప్తంగా జనవరి నెలలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించాలని సూచించారు. జనవరి 31 వరకు గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, ప్రమాదకర జంక్షన్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించి “అరైవ్ అలైవ్” అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

News January 2, 2026

PCOSతో మహిళల్లో మానసిక సమస్యలు

image

ప్రస్తుతకాలంలో పీసీఓఎస్‌తో బాధపడే మహిళల సంఖ్య పెరిగింది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పలు మానసిక సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీరిలో త్వరగా మతిమరపు రావడం, డిప్రెషన్‌తో పాటు టైప్‌–2 డయాబెటిస్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది.