News December 20, 2025

సిరిసిల్ల: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఇన్చార్జి కలెక్టర్

image

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తితో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పలు అంశాలపై చర్చించారు.

Similar News

News December 26, 2025

ఖమ్మం: మున్నేరులో బాలిక మృతదేహం

image

ఖమ్మం నగర సమీపంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వాగులో బాలిక మృతదేహం లభ్యమైంది. నీటిలో తేలుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ బాలిక ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చింది? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

News December 26, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నగదు కొరత

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బ్యాంకుల్లో నగదు కొరతతో ఆసరా లబ్ధిదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నవంబర్ నెలకు సంబంధించి 4 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.90 కోట్ల నగదు ప్రభుత్వం జమ చేసింది. విత్ డ్రా చేసేందుకు పోస్టాఫీస్‌, బ్యాంకులు వెళ్తున్న లబ్ధిదారులు నిరాశతో వెనుతిగుతున్నారు. RBI వద్ద నగదు కొరత, వరుస సెలవుల కారణంగా ఈ సమస్య నెలకొంది. కలెక్టర్లు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

News December 26, 2025

మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారా?

image

మనల్ని చూసి అసూయపడే వాళ్లు చుట్టూ ఉంటారు. వారిని ఏ మాత్రం కాస్త నిర్లక్ష్యం చేసినా సరే పెద్ద సమస్యగా మారతారు. వీరికి చెక్ పెట్టాలంటేఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండండి. చాలామంది భావోద్వేగాలు పెరిగి హర్ట్ అవుతారు. ఇది ప్రశాంతతను పాడు చేస్తుంది. ఎవరైనా అసూయతో మాట్లాడితే చాలా నెమ్మదిగా రెస్పాండ్ అవ్వండి. ఎమోషనల్ రియాక్ట్ అవడం వల్ల సమస్య పెద్దది అవుతుంది. మీ పనిపై శ్రద్ధ పెడితే ఇలాంటివి పెద్దగా బాధించవు.