News February 4, 2025
సిరిసిల్ల: జిల్లా BJP అధ్యక్షుడు ఎవరో..?

బీజేపీ నూతన అధ్యక్షుల ప్రకటనలో భాగంగా 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. మిగతా 11 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాల్సి ఉంది. రెడ్డి, మున్నూరు కాపులకు 6, 4-గౌడ్స్, వైశ్య, ఎస్సీలకు 2, కమ్మ, ఆర కటిక, పద్మశాలీ, పెరిక, ముదిరాజ్‌లకు 1 చొప్పున BJP అధ్యక్షులను నియమించింది. అయితే ఇప్పటివరకు సిరిసిల్ల అధ్యక్షుడినైతే ప్రకటించలేదు.కాగా జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 24, 2025
రావులపాలెం: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన అడపాల కోటమ్మ (61) మృతి చెందింది. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 24, 2025
విజయవాడ బస్టాండ్‌లో నిలువు దోపిడీ..!

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లోని స్టాల్స్ నిర్వాహకులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ సహా ప్రతి వస్తువుపై MRP కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. గతంలో ఫిర్యాదులు అందినప్పటికీ, RTC అధికారులు లైట్ తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బస్టాండ్‌ల్లో ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు.
News October 24, 2025
రాజమండ్రి: బాలికపై అత్యాచారం.. ఇద్దరిపై పోక్సో కేసు

రాజమండ్రి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటున్న బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ గురువారం తెలిపారు. 20వ తేదీన దీపావళి టపాకాయల కోసం బయటకు వెళ్లిన బాలికను ముందుగానే పరిచయం ఉన్న అజయ్ కుమార్ మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వార్డెన్ ఫిర్యాదు మేరకు అజయ్, అతని స్నేహితుడు సత్య స్వామిపై కేసు నమోదు చేశారు.


