News December 15, 2025
సిరిసిల్ల: జీపీ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యేలు

జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగిన 3 మండలాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పట్టు నిలుపుకున్నారు. తంగళ్ళపల్లి మండలంలో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఇల్లంతకుంట మండలంలో అత్యధిక సీట్లు గెలుచుకుని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బోయినపల్లి మండలంలో అత్యధిక స్థానాలు దక్కించుకుని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.
Similar News
News March 3, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. పెరుగుతున్న మృతుల సంఖ్య..!

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 13 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిన్నటి వరకు ఆరుగురు మృతి చెందగా.. నేడు చౌడేశ్వర్ నగర్‌కు చెందిన జి.సూర్యరావు(81) మృతి చెందినట్లు తెలిపారు.
News March 3, 2026
లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించి సరిహద్దు వెంట వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులను అడ్డుకోవడానికి ‘సెక్యూరిటీ జోన్’ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ చేపట్టింది. దీనికి ప్రతిచర్యగా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడుతోంది.
News March 3, 2026
ప్రొద్దుటూరులో తగ్గిన బంగారం ధర

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,700
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,364
* 10 గ్రాముల వెండి ధర రూ.2,800.
నిన్న 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.17,000 ఉండగా నేడు రూ.300 తగ్గి రూ.16,700కు చేరింది.


