News November 26, 2025
సిరిసిల్ల: ‘టీఆర్పీ అభ్యర్థులను గెలిపించండి’

రానున్న సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుర్ర మల్లేశం గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో టీఆర్పీ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించి, ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో పార్టీని బలపరుస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. పలువురు నాయకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Similar News
News November 27, 2025
NRPT: కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్‌ను పరిశీలించిన పరిశీలకురాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని నారాయణపేట జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎ.సీతాలక్ష్మి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆమెకు స్వాగతం పలికారు.
News November 27, 2025
బ్యాంకర్లు రుణ లక్ష్యసాధనలో పురోగతి సాధించాలి: ASF కలెక్టర్

బ్యాంకర్లు 2025-26 వార్షిక సంవత్సర రుణ లక్ష్య సాధనలో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ASF కలెక్టరేట్‌లో వార్షిక సంవత్సరం 2వ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్‌డీఓ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్‌లతో కలిసి బ్యాంక్ లింకేజీ రుణాలపై సమీక్షించారు.
News November 27, 2025
FLASH: MHBD: మహమూద్ పట్నం ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

మహబూబాబాద్ జిల్లా మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు రిజర్వ్ చేశారంటూ గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎలా రిజర్వ్ చేశారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆరుగురు ఎస్టీ ఓటర్లు, ఒకటే వార్డులో ఉంటే, మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు ధర్మాసనం నిలదీసి స్టే విధించింది.


