News September 11, 2025

సిరిసిల్ల: టీబీ రహిత గ్రామాల కోసం అవగాహన కార్యక్రమం

image

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఈరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా వైద్యాధికారి డా.ఎస్.రజిత టీబీ రహిత గ్రామాల కోసం ఆరు సూచీలపై స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీస్, ఎంఎంపీఓలకు మార్గదర్శకాలు ఇచ్చారు. టీబీ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స, ప్రభుత్వ సదుపాయాలపై వివరించారు.

Similar News

News September 12, 2025

HYDలో దంచి కొడుతున్న వర్షం.. రికార్డు ఇదే!

image

HYD వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. నిన్న కురిసిన వర్షానికి దాదాపు 5 రేట్ల వర్షం పడిందని TGPDS తెలిపింది. హయత్‌నగర్‌లో గరిష్ఠంగా 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. డిఫెన్స్ కాలనీలో 102.3, వనస్థలిపురం 44.5, గచ్చిబౌలి 19.5, ముషీరాబాద్ 15.5, కూకట్‌పల్లిలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు తెలిపింది. రేపు సైతం మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

News September 12, 2025

కరీంనగర్: శ్మశానవాటికలో కరవైన వసతులు.. ఆగ్రహించిన గ్రామస్థులు

image

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో 3 నెలల చిన్నారి అనారోగ్యంతో మృతిచెందింది. చిన్నారి మృతి చెందడంతో దహన సంస్కారాలు చేయడానికి వెళ్తుంటే వర్షం మొదలై రాత్రి అయింది. శ్మశానవాటికలో విద్యుద్దీపాలు లేకపోవడంతో అంధకారం ఏర్పడింది. గ్రామస్థులు, అంత్యక్రియలకు వచ్చిన కుటుంబ సభ్యులు తమ సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో దహన సంస్కారాలు నిర్వహించారు. కనీస వసతులు లేకపోవడంతో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

News September 12, 2025

జగిత్యాల: ఈనెల 20న క్రీడా పోటీలు

image

జగిత్యాల యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 20న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తెలిపారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలతోపాటు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిమ్మకాయ చెంచా, మ్యూజికల్ ఛైర్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.