News February 8, 2025

సిరిసిల్ల: ట్రాక్టర్‌లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్‌‌‌లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.

Similar News

News February 8, 2025

అనూహ్యం.. ముస్లింల ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం

image

ఢిల్లీలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత ఆప్ ఆధిక్యం కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయా స్థానాల్లో బీజేపీ దూసుకొచ్చింది. మొత్తం 12 స్థానాల్లో ప్రస్తుతం 7 చోట్ల బీజేపీ లీడింగ్‌లో ఉంది. దీంతో ఆప్, కాంగ్రె‌స్‌‌ని కూడా ముస్లింలు ఆదరించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News February 8, 2025

HYD: జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు

image

ముందస్తు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపత్తు నిర్వహణ చర్యల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సత్వర స్పందన ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చని, అధికారులు సిబ్బంది విపత్తు నిర్వహణ విధానాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.

News February 8, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శనివారం క్వింటా సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

error: Content is protected !!