News January 8, 2026

సిరిసిల్ల: ‘ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి’

image

ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ అన్నారు. సిరిసిల్లలో రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొబైల్ వాడుతూ వాహనాలు నడపవద్దన్నారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. శ్రీనివాసరావు, దిలీప్, భాస్కర్, వేణు, తిరుపతి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 10, 2026

పవన్ కళ్యాణ్ పర్యటనలో కనిపించని కాకినాడ ఎంపీ

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురంలో పర్యటించగా, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఎక్కడా కనిపించలేదు. పది రోజులు ముందే షెడ్యూల్ ఖరారైనా ఎంపీ రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధినేతకు ఆయన దూరంగా ఉంటున్నారనే ప్రచారానికి ఈ పరిణామం బలం చేకూర్చిందని చర్చ సాగుతోంది. కాగా దీనిపై ఇటు పార్టీ గానీ, అటు ఎంపీ గానీ స్పందించలేదు.

News January 10, 2026

శని దోష నివారణ మంత్రాలు

image

జాతకంలో శని దోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి ‘ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని, శని ధ్యాన శ్లోకాలను 19 వేల సార్లు పఠించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు. శని శాంతి మంత్రం, శని పత్ని నామ స్తుతి, శని చాలీసా చదివినా విశేష ఫలితాలుంటాయని సూచిస్తున్నారు. శనివారం నాడు ఈ మంత్రాలను స్మరిస్తే శని బాధలు క్షీణిస్తాయని నమ్మకం.

News January 10, 2026

జగిత్యాల: సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశానంతరం నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా డా.మెట్టు దాసు, ప్రధాన కార్యదర్శిగా సంఘ రత్నాకర్, కోశాధికారిగా కోల సత్యనారాయణ, ఇతర సంఘ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మెట్టు దాసు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.