News February 27, 2025

సిరిసిల్ల: డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

image

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఏపీవో, పిఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు, అధికారులు పోలింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కగా అందించాలని పేర్కొన్నారు.

Similar News

News February 27, 2025

అఫ్గాన్ చేతిలో ఓటమి.. కెప్టెన్సీపై బట్లర్ కీలక వ్యాఖ్యలు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీపై జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పుడు ఎలాంటి ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ మిగతా జట్టు సభ్యుల కోసం నేను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. దీంతో త్వరలో బట్లర్ వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేయనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

News February 27, 2025

నందిపేట్: దుబాయిలో ఉద్యోగాల పేరిట మోసం

image

నందిపేట్ పోలీస్ స్టేషన్‌లో గల్ఫ్ ఏజెంట్ కస్పా శ్యామ్, మధు, సాయి రెడ్డి, గుడ్ల ప్రకాష్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయిలాపూర్ గ్రామానికి చెందిన ఏజెంట్ కస్పా శ్యామ్ దుబాయిలో ఉద్యోగాల పేరిట తమ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. నలుగురు దాడి చేశారని అమలాపురానికి చెందిన బాధితుడు నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News February 27, 2025

మారుమూల గ్రామాల్లో అల్లూరి ఎస్పీ పర్యటన

image

పెదబయలు మండలం మారుమూల జామిగూడా పంచాయతీ గుంజివాడ, చింతల వీధి గ్రామాలలో బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, ఏఎస్పీ ధీరాజ్ పర్యటించారు. గుంజివాడ గ్రామంలో శివరాత్రి సందర్భంగా జరుగుతున్న బాపనమ్మ బాలలింగేశ్వర దేవత జాతర సందర్భంగా దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలో గల తారాబు జలపాతాన్ని సందర్శించి సందడి చేశారు.

error: Content is protected !!