News February 7, 2025
సిరిసిల్ల: డైరీ, టెక్స్‌టైల్ ఎగుమతులు పెంచాలి: కలెక్టర్
డైరీ, టెక్స్ టైల్ రంగాల్లో ఎగుమతుల పెంపునకు కృషిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ లెవెల్ ఎకోస్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ) సమావేశం నిర్వహించారు.
Similar News
News February 7, 2025
పలు ఉన్నత ఆశ్రమ పాఠశాలను సందర్శించిన MHBD కలెక్టర్
మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఉన్నత ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే పరిశుభ్రంగా ఉండే బోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాల ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
News February 7, 2025
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. WAY2NEWSలో ఎక్స్‌క్లూజివ్‌గా
యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఉ.7 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానుండగా, ప్రతి అప్‌డేట్‌ను WAY2NEWS మీకు ఎక్స్‌క్లూజివ్‌గా అందించనుంది. అన్ని వివరాలు అందరికంటే ముందే మన యాప్‌లో చూడవచ్చు.70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ BJPకే మొగ్గుచూపగా, కొన్ని AAPకూ అవకాశం ఉందని అంచనా వేశాయి.
News February 7, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచకపోతే రేవంత్ చిట్టా విప్పుతా: కృష్ణయ్య
బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచకపోతే సీఎం రేవంత్ రెడ్డి చిట్టా విప్పుతామని రాజ్యసభ ఎంపీ ఆర్?కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని కామెంట్ చేశారు. బీసీల అణచివేతకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారన్నారు.