News April 18, 2025
సిరిసిల్ల: తెలంగాణ సాయుధ రైతన్న పోరాట వీరుడు కర్రోల్ల నర్సయ్య

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు కర్రోళ్ల నర్సయ్య వర్థంతి నేడు. ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1957 నుండి1962 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో జన్మించారు. 2003లో ఏప్రిల్ 17న గుండెపోటుతో మరణించారు. నర్సయ్య భార్య దుర్గమ్మ గతంలో చనిపోయిందని, ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు ఇటీవలే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
Similar News
News December 31, 2025
2025 క్రైమ్ రిపోర్టు: హత్యలు 54, కిడ్నాప్‌లు 25

శ్రీ సత్యసాయి జిల్లాలో 2025లో మొత్తం 4,028 కేసులు నమోదయ్యాయని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే నేరాలు 2 శాతం పెరిగాయని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలు 340 నుంచి 303కు తగ్గాయి. హత్యలు 54, కిడ్నాప్‌లు 25గా నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 26.3 శాతం పెరిగాయి. ఈ-చలాన్ల ద్వారా రూ.1.01 కోట్ల జరిమానా వసూలు చేశారు. హిందూపురం బ్యాంకు చోరీ కేసులో రూ.5.5 కోట్ల బంగారాన్ని పోలీసులు <<18718838>>రికవరీ<<>> చేశారు.
News December 31, 2025
REWIND-2025: విశాఖ అభివృద్ధిలో కీలక మలుపు

2025లో ఉమ్మడి విశాఖ అభివృద్ధి దిశగా కీలక మలుపు తిరిగింది. ఐటీ, పరిశ్రమలు, మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ఆర్థిక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఏడాది విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అంశంగా గూగుల్ డేటా సెంటర్ ప్రకటన నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదిత మిట్టల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమల రంగంలో కొత్త ఆశలు రేపింది. మొత్తంగా 2025 విశాఖ అభివృద్ధి పునాదులు వేసిన ఏడాదిగా నిలిచింది.
News December 31, 2025
వర్ధన్నపేట ఎమ్మెల్యే పేరుతో సైబర్ వల..!

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ఆయన పోలీస్ అధికారిగా ఉన్న సమయంలోని ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు, ఫ్రెండ్ లిస్ట్‌లోని వారితో చాట్ చేసి మొబైల్ నంబర్లు సేకరిస్తున్నారు. అనంతరం వాట్సాప్‌లో సంప్రదించి డబ్బులు పంపాలని బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు బాధితులు డబ్బులు పంపినట్టు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


