News April 5, 2025

సిరిసిల్ల: తొలి దశలోనే గుర్తించాలి: డీఎంహెచ్వో

image

అంగన్వాడీ సెంటర్లలోని పిల్లల లోపాలను ఇతర దశలోనే గుర్తించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్ల పట్టణంలో సమితి అధికారులతో శనివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 7 నుంచి అంగన్వాడీ పిల్లలకు అప్తాలమిక్ ద్వారా పెరుగుదల లోపాలను తొలి దశలోనే గుర్తించాలన్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించి భవిష్యత్తులో కంటిచూపు సమస్య తీవ్రతను తగ్గించే విధంగా చూడాలని ఆదేశించారు.

Similar News

News April 6, 2025

వృద్ధి రేటులో రెండో స్థానంలో ఏపీ: CBN

image

AP: 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు(8.21%) సాధించిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే తమ విధానాలతో రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ పునరుజ్జీవం, తయారీ రంగం, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సమష్ఠి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కాగా 9.69% వృద్ధి రేటుతో TN తొలి స్థానంలో ఉంది.

News April 6, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

విశాఖలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మల్కాపురానికి చెందిన సత్యనారాయణ స్కూటీపై కుమార్తె ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డాక్‌యార్డ్ నుంచి మారుతీ సర్కిల్ మీదుగా వెళుతుండగా కొత్త పెట్రోల్ బంక్ వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 6, 2025

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

error: Content is protected !!