News March 17, 2025
సిరిసిల్ల: త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో పెట్టకుండా అన్ని దరఖాస్తులను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News March 17, 2025
యాదగిరిగుట్ట: ప్రసాద విక్రయాలతో రూ.7,92,130 ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. సోమవారం 1,640 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.82,000, ప్రసాద విక్రయాలు రూ.7,92,130, VIP దర్శనాలు రూ.1,95,000, బ్రేక్ దర్శనాలు రూ.66,900, కార్ పార్కింగ్ రూ.2,70,000, వ్రతాలు రూ.94,400, ప్రధాన బుకింగ్ రూ.1,16,550, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.19,29,241 ఆదాయం వచ్చింది.
News March 17, 2025
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల కానున్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి జూన్ నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని TTD వెల్లడించింది. ఈ టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18, 19, 20వ తేదీల్లో ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించింది. అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని సూచించింది.
News March 17, 2025
‘ట్రూత్ సోషల్’లో ప్రధాని మోదీ.. తొలి పోస్ట్ ఇదే

ట్రంప్ మీడియా&టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో భారత ప్రధాని మోదీ జాయిన్ అయ్యారు. ఈ వేదికపై అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. లెక్స్ ఫ్రైడ్‌మన్‌కు ఇచ్చిన తన ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసినందుకు US ప్రెసిడెంట్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ తన ప్రకటనలు ఎక్కువగా ‘ట్రూత్ సోషల్’లోనే చేస్తారన్న సంగతి తెలిసిందే.