News March 10, 2025

సిరిసిల్ల: దరఖాస్తుల ఆహ్వానం: రాఘవేందర్ రావు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత జోలి శాఖ సహాయ సంచాలకులు రాఘవేందర్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

సంగారెడ్డి జిల్లాలో మూడు డెంగ్యూ కేసులు

image

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డిలోని సోమేశ్వర వాడలో ఒకటి, ఇస్నాపూర్లో ఒకటి, రామచంద్రపురం పరిధిలోని వెలిమెల గ్రామంలో ఒకటి నమోదు అయ్యానని పేర్కొన్నారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.

News July 6, 2025

మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. ఎక్కడెక్కడ పెడతారంటే?

image

ఇటీవల బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి నగేశ్ ఆఫీస్‌లోని బాత్రూమ్‌‌లో మహిళల వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు. అయితే సీక్రెట్ కెమెరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా అద్దం వెనుక, తలుపు వద్ద, గోడ మూలల్లో, పైకప్పు సీలింగ్, బల్బులో, టిష్యూ పేపర్ బాక్స్‌లో, స్మోక్ డిటెక్టర్‌లో పెట్టే అవకాశం ఉందంటున్నారు. అప్రమత్తతతో వీటిని గుర్తించవచ్చని చెబుతున్నారు.

News July 6, 2025

MHBD: సోమవారం జరిగే ప్రజావాణి రద్దు

image

సోమవారం(జూలై 7) జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. MHBD, కేసముద్రం మండలాల్లో మంగళవారం ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులంతా క్షేత్రస్థాయిలో పనుల్లో ఉన్నారన్నారు. దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.