News March 27, 2025

సిరిసిల్ల: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కృష్ణనాయక్ తండాకు చెందిన శివరాత్రి సాయి కృష్ణ (17) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొండగట్టు ఆంజన్నను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో టాప్‌పై కూర్చున్న సాయి కృష్ణ కింద పడటంతో పైనుండి ఆటో వెళ్ళింది. ఈ ప్రమాదంలోసాయి కృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 30, 2025

పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేట: ఉగాది వేడుకలలో పాల్గొన్న కలెక్టర్,ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు ☞ అమరావతి: మద్యం సేవించి వ్యక్తి మృతి☞ రాజుపాలెం: నేతి వెంకన్నకు వెన్న సమర్పించిన భక్తులు ☞ రొంపిచర్ల: ప్రభల నిర్మాణంలో రాజకీయ వివాదం ☞ సత్తెనపల్లి: గడియార స్తంభం వద్ద అన్యమత ప్రచారంపై నిరసన☞ గురజాల: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళన ☞ వినుకొండ: పంచాంగ శ్రవణంలో పాల్గొన్న రాష్ట్ర చీఫ్ విప్

News March 30, 2025

నంద్యాలలో ఆకస్మిక తనిఖీలు

image

నంద్యాల పట్టణం నందమూరి నగర్‌లోని ఆవాసియ విద్యాలయాన్ని బుడగజంగాల రాష్ట్ర సమగ్ర శిక్ష ఐఈడీకో ఆర్డినేటర్ కల్పనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. భోజనాలు, వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె వెంట సీఆర్పిీ హిమశేఖర్, చంద్రమ్మ , గాయత్రి , హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

News March 30, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> పాడేరు మోదకొండమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు
> అడ్డతీగల ఏజెన్సీలో పూలకు పెరిగిన డిమాండ్
> పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి: కలెక్టర్
> చాపరాయి జలపాతం వద్ద పర్యాటకుల సందడి
> వీఆర్ పురం: వాహనం పైనుంచి పడి వ్యక్తి మృతి
> అరకులో రద్దీగా ఆలయాలు
> పాడేరు ఘాట్లో నేలకొరిగిన భారీ వృక్షం
> పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షం

error: Content is protected !!