News March 20, 2025

సిరిసిల్ల: ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు: కలెక్టర్

image

సిరిసిల్ల జిల్లాలో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25లో పండిన నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్‌ తన చాంబర్‌లో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25 ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

Similar News

News February 10, 2026

డిజిటల్ లావాదేవీల పై అప్రమత్తత అవసరం: కలెక్టర్

image

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన పొందాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. RBI ఫిబ్రవరి 9 నుంచి 13వ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.

News February 10, 2026

GWL: ఈనెల 12 నుంచి జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు

image

సీఎం కప్ 2025-26 జిల్లాస్థాయి పోటీలు గద్వాల ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి కృష్ణయ్య మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 12, 13, 16, 17 తేదీల్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు తప్పక పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు 98854 79896, 99593 44234 నంబర్లను సంప్రదించాలన్నారు.

News February 10, 2026

ADB: ఈ నెల 20 వరకు పత్తి కొనుగోళ్లు

image

సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న పత్తి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. రైతులు పత్తి అమ్మెందుకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులకు వీలులేదన్నారు. పత్తి నిల్వ ఉన్న రైతులు తప్పకుండా త్వరగా సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.