News January 3, 2026
సిరిసిల్ల: నారుమడులపై చలి ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

యాసంగి సాగుకు అధిక చలి, మంచుతో నారుమడులపై తీవ్ర ప్రభావం ఏర్పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలితో పాటు సూర్యరశ్మి లేకుండా దట్టమైన పొగ మంచు ఉండడంతో నారుమల్లు ఎదగడం లేదు. సిరిసిల్ల జిల్లాలోని అధిక గ్రామాల్లో నారుమల్లు పోసిన 25 రోజుల తర్వాత నాట్లు వేసేవారు. కానీ, 35 రోజులు దాటినా నాట్లు వేయలేని దుస్థితి నెలకొంది. నాట్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News February 13, 2026
కృష్ణాజిల్లా MLAల ప్రోగ్రెస్ ఇదే

కృష్ణాజిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలన్నారు. అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని సూచించారు.
News February 13, 2026
సివిల్స్‌లో 2,834 ఉద్యోగ ఖాళీలు: జితేంద్ర సింగ్

దేశంలోని 3 సివిల్ సర్వీసెస్‌లో 2,834 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. 2025 జనవరి 1 నాటికి 1,300 ఐఏఎస్, 1,029 ఐఎఫ్ఎస్, 505 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ మూడు సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం 15,169 పోస్టులను అనుమతించగా 12,335 ఖాళీలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.
News February 13, 2026
శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రం శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల యాత్రికులు భారీగా తరలివస్తున్నారు. శివరాత్రి జాగారం చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. నేడు స్వామి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. క్షేత్రమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది.


