News February 4, 2026
సిరిసిల్ల: నిధులు తెచ్చే బాధ్యత నాది: బండి సంజయ్

సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే పెద్ద ఎత్తున నిధులిస్తానని పీఎం మోదీ భరోసా ఇచ్చారు. ఆయన మాటగా చెబుతున్నా ఛైర్మన్ పీఠాన్ని మాకు అప్పగించండని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. లేనిపక్షంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తారని, పైసలు మావి, ప్రగతి మాది, సోకులు వాళ్లవని అన్నారు. కమిషన్లు వాళ్లవని, మళ్లీ అలాంటి వారికి ఎలా ఓట్లేస్తారని ఓటర్లను ప్రశ్నించారు.
Similar News
News February 12, 2026
మంత్రాలయ మహాత్యం

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావనం అతి పవిత్రమైనది. 1671లో స్వామివారు సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. ఆయన భౌతికంగా మనకు కనిపించకపోయినా, మరో 700 ఏళ్ల పాటు అందులోనే ఉంటూ అనుగ్రహిస్తారని ప్రతీతి. కల్పవృక్షంలా కోరిన కోర్కెలు తీర్చే ఈ క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. స్వామివారికి సమర్పించే ‘మృత్తిక’ (పవిత్ర మట్టి) సకల వ్యాధులను, గ్రహ దోషాలను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News February 12, 2026
జనగామ: ఒకే కుటుంబం.. మూడు తరాల ఓట్లు!

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో బుధవారం జరిగిన ఎన్నికల్లో మూడు తరాలకు చెందిన ఓ కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుంది. మున్సిపల్ పరిధిలోని శివునిపల్లిలోని సుదర్శనం-సరోజన దంపతులకు చెందిన మూడు తరాల కుటుంబ సభ్యులు ఒకే వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదర్శన్ దంపతులతో పాటు కొడుకులు, కోడళ్లు, మనుమరాళ్లు, బిడ్డ, అల్లుడు మొత్తం తొమ్మిది మంది ఓటేశారు.
News February 12, 2026
ఫిబ్రవరి 12: చరిత్రలో ఈరోజు

➤ 1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
➤ 1809: అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
➤ 1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
➤ 1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
➤ 1962: సినీ నటుడు జగపతిబాబు జననం(ఫొటోలో)
➤ 1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
➤ 2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం


