News February 12, 2025
సిరిసిల్ల: నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి: మాస్టర్ ట్రైనర్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739358423963_52088599-normal-WIFI.webp)
ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ఆర్వోలు, ఏఆర్వోలు విధులు నిర్వర్తించాలని మాస్టర్ ట్రైనర్లు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులు ఎంతో జాగరూకతతో నిర్వర్తించాలని నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉంటుందని స్పష్టం చేశారు.
Similar News
News February 12, 2025
23న జనసేన శాసనసభా పక్ష భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373775626_81-normal-WIFI.webp)
AP: ఫిబ్రవరి 23న జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం జరిగే ఈ భేటీలో పాల్గొనాలని ఎంపీలు, MLAలు, MLCలను పార్టీ ఆదేశించింది. 24వ తేదీన బడ్జెట్ సమావేశాలు పాల్గొననున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
News February 12, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లిరాజు తండ్రి పోలీస్ కంప్లైంట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739361930288_1045-normal-WIFI.webp)
‘సంక్రాంతికి వస్తున్నాం’లో బుల్లి రాజు పాత్రతో బాలనటుడు రేవంత్ భీమాల అందర్నీ ఆకట్టుకున్నాడు. అతడి పేరిట కొన్ని ట్విటర్, ఇన్‌స్టా ఖాతాలు రాజకీయ విమర్శలు చేస్తుండటంతో అతడి తండ్రి శ్రీనివాసరావు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆయా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. రేవంత్ భీమాల అన్న పేరిట ఉన్న ఇన్‌స్టా మాత్రమే తమదని, రేవంత్‌ను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.
News February 12, 2025
కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికలకు 77 పోలింగ్ కేంద్రాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739369680529_60300469-normal-WIFI.webp)
కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫిబ్రవరి 27న నిర్వహించే పోలింగ్‌కు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్‌లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలాజీ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో Polling staff కీలక పాత్ర వహించాలన్నారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.