News November 27, 2025

సిరిసిల్ల: నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద, గంభీరావుపేట మండలం పెద్దమ్మ వద్ద, ముస్తాబాద్ వెంకట్రావు పల్లి వద్ద, వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ వద్ద, బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద, రుద్రంగి మండలం మానాల క్రాస్ రోడ్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News November 28, 2025

జహిరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య

image

భర్తతో విభేదాలు, వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జహీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్దిపాడుకు చెందిన స్వాతికి(22) ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు, అత్తమామ వేధిస్తున్నారని మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కాశీనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 28, 2025

ASF: పారామెడికల్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025-26 విద్యా సం. గాను DMLT (30), DECG (30) కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును DEC1 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు www.tgpmb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు కళాశాల వెబ్‌సైట్ gmckumurambheem asifabad.orgను సంప్రదించాలని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.

News November 28, 2025

నిర్మల్: 2019లో 88 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..!

image

2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో 88 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ ఏడు 4 GPలు పెరిగాయి. ప్రస్తుతం 400 గ్రామ పంచాయతీలు ఉండగా.. 3,396 వార్డులున్నాయి. అయితే అప్పటి ప్రభుత్వం పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించినా.. నేటికి ఆ సొమ్ము GP ఖాతాల్లో జమ కాలేదు. అటు ఏకగ్రీవం చేస్తే కేంద్రం నుంచి రూ.10లక్షలు ఇస్తామని బండి ప్రకటించారు.