News December 29, 2025

సిరిసిల్ల: నేటి నుంచి యథావిధిగా ప్రజావాణి

image

గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ప్రజాసమస్యల పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు సామాన్యులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం తమను సంప్రదించాలని పేర్కొన్నారు.

Similar News

News February 20, 2026

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి కట్టడికి సూచనలు

image

గొర్రెల‌కు నీలి నాలుక వ్యాధి సోక‌కుండా ఉండాలంటే వైర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మ‌య్యే దోమ‌ల‌ను కట్టడి చేయాలి. దీని కోసం ప్రతి రోజూ ఎండిన వేపాకులతో పొగ పెట్టాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేస్తే మిగ‌తా వాటికి వ్యాధి వ్యాపించ‌దు. గొర్రెల షెడ్‌ను పొడిగా ఉంచాలి. వ్యాధి సోకిన గొర్రెలను వెటర్నరీ డాక్టరుకు చూపించి అవసరమైన మందులు వాడాలి. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అందించే టీకాలను గొర్రెలకు వేయించాలి.

News February 20, 2026

అనకాపల్లి: ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 16 అర్జీలు

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3వ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారానికి అవకాశం గల ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

News February 20, 2026

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసు.. UPDATE

image

TG: అల్లు అర్జున్ ‘పుష్ప-2’ రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను మూడోసారి నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. అందులో లోపాలు ఉన్నాయని, హార్డ్ డిస్క్‌లు, CDలు, పెన్‌డ్రైవ్‌లు జత చేయలేదని పేర్కొంది. కాగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 23 మందిపై కేసు నమోదైంది.