News December 2, 2025
సిరిసిల్ల: నేడే రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ ఫైనల్స్

సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్స్ 2వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు. బాలురు, బాలికల విభాగంలో జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఉదయం వేళలో సెమీఫైనల్స్ మ్యాచ్ లు ఉంటాయని, సెమీఫైనల్స్ విజేతల మధ్య సాయంత్రం వేళలో ఫైనల్స్ మ్యాచ్ నిర్వహిస్తామని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకుమార్, కార్యదర్శి రాందాస్, రెఫరీ కమిటీ కన్వీనర్ రవీందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News April 10, 2026
IPL: నేడు తొలి ఓటమిని రుచి చూసేదెవరో?

IPLలో ఈరోజు గువాహటి వేదికగా RCB, RR మధ్య 7.30PM నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. RR ఆడిన 3 మ్యాచులూ గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. RCB 2 విజయాలతో మూడో స్థానంలో ఉంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా RCB 17, RR 14 విక్టరీలు సాధించాయి. కాగా నేటి మ్యాచుకు వర్షం ముప్పు లేదని క్రిక్‌బజ్ పేర్కొంది.
News April 10, 2026
75% అటెండెన్స్ లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు!

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హాజరు 75% లేకపోతే పరీక్షలకు అనుమతించొద్దని, స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయనుంది. అలాగే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతి రోజే దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కాలేజీలో చేరిన రోజే విద్యార్థులకు ఫ్రీ స్టడీ మెటీరియల్ అందించనున్నారు.
News April 10, 2026
కర్నూలు: పిడుగు పడి మృతిచెందిన వ్యక్తి ఇతనే..!

ఎమ్మిగనూరు(M) ఏనుగుబాల గ్రామానికి చెందిన వలస కూలీ <<19610452>>పిడుగుపాటుకు<<>> గురై మృతి చెందిన ఘటన పల్నాడు(D) సత్తెనపల్లి(M) కట్టవారిపాలెంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పారే సురేశ్(21) మిరపకాయలు తెంపే పనికి వెళ్లాడు. ఆకస్మికంగా కురిసిన ఉరుములు మెరుపుల వర్షంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు జగన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి సత్తెనపల్లి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


