News December 1, 2025

సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఆర్వోలకు శిక్షణ

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సిరిసిల్లలోని కలెక్టరేట్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రతి ఆర్‌ఓ వ్యవహరించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. నామినేషన్ల దాఖలు నుంచి లెక్కింపు వరకు అప్రమతంగా ఉండాలన్నారు.

Similar News

News March 9, 2026

కృష్ణా: PG విద్యార్థులకు అలర్ట్..పరీక్షలు ఎప్పుడంటే?

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో పీజీ(సైన్స్ కోర్సులు) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 2,3,4వ సెమిస్టర్(వన్ టైం ఆపర్చునిటీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 25- ఏప్రిల్ 4 మధ్య నిర్ణీత తేదీలలో వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. 1, 2 సెమిస్టర్లు ఉదయం & 3, 4 సెమిస్టర్లకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

News March 9, 2026

NZB: ప్రమాణస్వీకారం చేయించిన TPCC చీఫ్ మహేష్ కుమార్

image

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంతో TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షునిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రాజు, కోశాధికారిగా రాజ్ కుమార్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

News March 9, 2026

జగిత్యాల: ప్రజావాణి.. 56 ఫిర్యాదులు స్వీకరణ

image

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 56 ఫిర్యాదులు, వినతులు స్వీకరించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత తెలిపారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.