News December 12, 2025
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో ఎంపీపీలకు మిశ్రమ ఫలితాలు

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన మాజీ ఎంపీపీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. వేములవాడ రూరల్ మండలం వట్టెంల నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ విజయం సాధించగా, హనుమాజీపేటలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ తీగల రవీందర్ గౌడ్, చందుర్తిలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, రుద్రంగిలో మాజీ ఎంపీపీ గంగం స్వరూప ఓటమి పాలయ్యారు.
Similar News
News December 13, 2025
బాసర మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి పండుగ రోజు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు బాసర రైల్వే మేనేజర్ రవీందర్ తెలిపారు. బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, తదితర స్టేషన్‌ల మీదుగా రైలు నంబర్ 07274 మచిలిపట్నం – అజ్మీర్ డిసెంబర్ 21న, 07275 అజ్మీర్-మచిలీపట్నం- మీదుగా డిసెంబర్ 28న రైళ్లను నడుపుతున్నట్లు మేనేజర్ తెలిపారు.
News December 13, 2025
BHPL: ఒక్క రోజే గడువు.. ప్రలోభాలతో ఓట్లకు ఎర!

BHPL(D)లో 2వ విడత పోలింగ్‌కు ఒక్క రోజే గడువుంది. 79 పంచాయతీలకు, 547 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు, మద్యం మాంసంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఓటు కోసం సర్పంచ్, వార్డుల అభ్యర్థులు డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతండగా.. మహిళలను ఆకర్షించేందుకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News December 13, 2025
డిసెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

1952: దక్షిణ భారత నటి లక్ష్మి జననం
1955: కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ జననం
1960: విక్టరీ వెంకటేశ్(ఫొటోలో) జననం
1961: భారత దిగ్గజ క్రికెటర్ అలీఖాన్ పటౌడీ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోజు
1986: హిందీ నటి స్మితా పాటిల్ మరణం
1990: హీరోయిన్ రెజీనా జననం
2001: భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన రోజు


