News January 28, 2025

సిరిసిల్ల: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు ఎస్పీ

image

బ్యాంకుల వద్ద పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేయాలని అదనపు ఎస్పీ డి.చంద్రయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బ్యాంకు బ్రాంచ్‌లు, ఏటీఎంల భద్రతపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్ వద్ద ఎలక్ట్రానిక్ అలారం సిస్టం అందుబాటులో ఉండాలన్నారు. బ్యాంకు కార్యాలయాలు, ఏటీఎం సెంటర్ల వద్ద తప్పనిసరిగా పనిచేసే సీసీ కెమెరాలు ఉండాలని సూచించారు.

Similar News

News March 13, 2025

మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

image

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

News March 13, 2025

మార్చి 13: చరిత్రలో ఈ రోజు

image

* 1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం
* 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
* 1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు
* 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ మరణం
* 1978: డైరెక్టర్ అనూషా రిజ్వీ జననం

News March 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!