News January 7, 2026
సిరిసిల్ల: ‘పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’

ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.ఐదు కోట్ల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. పనుల పురోగతిని నిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 2, 2026
నల్లపాడు పీఎస్‌లో నన్ను వేధించారు: అంబటి

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయిన అంబటి రాంబాబును పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తనను నల్లపాడు పీఎస్‌లో టార్చర్ చేశారని అంబటి న్యాయమూర్తికి తెలిపారు. అధికారుల ఒత్తిడితోనే ఇలా చేయాల్సి వచ్చిందని సీఐ చెప్పారన్నారు. ఏ తప్పూ చేయకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారని వాపోయారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదని ఆరోపించారు.
News February 2, 2026
ప్లే ఆఫ్స్‌లోకి ఢిల్లీ మహిళల జట్టు

WPL-2026 లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ 122/8 పరుగులకే పరిమితం కాగా, ఢిల్లీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఢిల్లీ ఎల్లుండి గుజరాత్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.
News February 2, 2026
మజ్లిస్ మద్దతు లేనిదే మేయర్ పీఠం దక్కదు: అసదుద్దీన్

నల్గొండలో ఎంఐఎం మద్దతు లేనిదే మేయర్ పీఠం దక్కదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ భూములను అక్రమార్కుల నుంచి కాపాడిన ఘనత తమదేనని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని, తమ అనుమతి లేకుండా అధికారం దక్కదని ధీమా వ్యక్తం చేశారు.


