News January 9, 2026
సిరిసిల్ల : పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

రేపటి నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఉండడంతో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు. అనంతరం విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
Similar News
News January 20, 2026
ANU: ఫిబ్రవరి 3 నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు ప్రారంభమవుతాయని పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం తెలిపారు. బీపీఈడీ, యుజీ పీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 6వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు.
News January 20, 2026
సిరిసిల్ల: మంత్రి తుమ్మల పర్యటనపై నేత కార్మికుల ఆశలు..!

రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనపై సిరిసిల్ల నేతన్నలలో ఆశలు పెరుగుతున్నాయి. ఇందిరమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులకు అందించాలని, పవర్లూమ్ పరిశ్రమపై విధించిన అదనపు విద్యుత్ చార్జీలు రూ.40 కోట్లు వెంటనే విడుదల చేయాలని, వర్కర్ టు ఓనర్ పథకం పనులు పూర్తి చేసి త్వరగా కార్మికులకు అప్పగించాలనే డిమాండ్ పై స్పందిస్తారని వారు ఆశిస్తున్నారు.
News January 20, 2026
పశు ఔషది విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు : కలెక్టర్

జిల్లాలో పశు ఔషది విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ హాలులో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు సరసమైన ధరలకు మంచి నాణ్యమైన జనరిక్ మందులను అందించడం కోసం.”పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు.


