News April 9, 2025
సిరిసిల్ల: పోషణలోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

జిల్లాను పోషణలోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో అంగన్వాడి పిల్లల పోషణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీడీపీవో, సూపర్‌వైజర్లు, అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని సక్రమంగా అందించినప్పుడే పిల్లలలో మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుందని తెలిపారు.
Similar News
News April 17, 2025
నాగర్‌కర్నూల్: వంగూరు మండలానికి ఘనమైన చరిత్ర..!

NGKL జిల్లా వంగూర్ మండలానికి ఘనమైన చరిత్ర ఉంది. వంగూర్‌ను 6వ శతాబ్దంలో శాసనాల్లో ఒక విషయ రాజ్యాంగా పేర్కొన్నారు. చాళుక్యులు, పల్లవులు పాలనతో పాటు కందుకూరు చోళులు 250 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు వంగూర్ రాజ్యాన్ని పాలించారు. పులకేశి కుమారుడు విక్రమాదిత్యుడు గెల్వలాంబ దేవాలయాన్ని నిర్మించాడు. తెలంగాణలో రెండో కథల సంపుటి, గడ్డి పూలు కథల రచయితలు ఇద్దరూ ఇక్కడి వారే. ప్రముఖ పరిశోధకుడు యాదగిరి చారి ఈ మండలం వారే.
News April 17, 2025
అనంత– బెంగళూరు రైలుకు భారత రైల్వే శాఖ ఆమోదం

శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే బోర్డు 2025 ఏప్రిల్ 15న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పలుమార్లు ఈ విషయంపై ప్రస్తావించారు. త్వరలోనే కేంద్ర రైల్వే మంత్రి ప్రారంభిస్తారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం తెలిపారు. రైల్వే శాఖ మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
News April 17, 2025
వనపర్తి: బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే యాసంగి వరి ధాన్యం: డీఎస్ చౌహాన్

మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన ధాన్యం క్లియర్ చేసి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే యాసంగి వరి ధాన్యం కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్. చౌహాన్ స్పష్టం చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ అప్పగింతపై గురువారం అదనపు కలెక్టర్లు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఇందులో వనపర్తి జిల్లా అధికారులు పాల్గొన్నారు.