News December 2, 2025

సిరిసిల్ల : పోస్టల్ బ్యాలెట్‌పై అధికారులకు శిక్షణ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తహశీల్దార్లు, ఎంపీఓలు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లకు పోస్టల్ బ్యాలెట్‌పై శిక్షణ ఇచ్చారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ట్రైనర్లు మంగళవారం పీపీటీ ద్వారా శిక్షణ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

Similar News

News March 29, 2026

HYD: జిల్లాల్లో పడిపోతున్న గ్రౌండ్ లెవెల్స్

image

HYD, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాల స్థాయి పడిపోతోంది. వేసవికి ముందే అనేక ప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు సగటున 12.87 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

News March 29, 2026

NLG: ఎండుతున్న పొలాలు.. ట్యాంకర్లే దిక్కు!

image

జిల్లాలో ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక వరి పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. చేతికి వచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు మునుగోడు, సూర్యాపేట, నడిగూడెం, రాజాపేట మండలాల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు వేల రూపాయలు ఖర్చు చేసి నీళ్లు పోయిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 29, 2026

మైదుకూరు: భర్త కోసం భార్య పోరాటం

image

మైదుకూరు పట్టణం శ్రీరామ్ నగర్‌లో ఉంటున్న భర్త కోసం భార్య అత్తవారి ఇంటి ముందు పోరాటానికి సిద్ధమైంది. తనకు వివాహమై మూడేళ్లయిన కాపురానికి రానివ్వడం లేదంటూ విహాహిత అత్తగారి ఇంటి ముందు ధర్నాకు దిగింది. 16 తులాల బంగారం, రూ.7 లక్షలు ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేశారని తన భర్త కాపురానికి పంపకుండా అత్త, మామ ఆడపడుచులు అడ్డుపడుతున్నారని న్యాయం చేయాలని కోరారు.