News November 1, 2025

సిరిసిల్ల: ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముగ్గురి అరెస్ట్

image

సిరిసిల్ల పట్టణంలో కత్తులు పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. సుందరయ్య నగర్ సిక్కువాడకు చెందిన బురహాని నర్సింగ్, రాజేష్ సింగ్, బురణి గోపాల్ సింగ్‌లు పెద్ద కత్తులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

Similar News

News November 2, 2025

మంచిర్యాల: రూ.1.39 కోట్లు కాజేసిన నిందితుడి అరెస్టు

image

తప్పుడు లెక్కలతో వరి ధాన్యాన్ని చూపించి సివిల్ సప్లై నిధులు రూ.1.39 కోట్లు కాజేసిన కేసులో 3వ నిందితుడు సాయికుమార్‌ను అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు జైపూర్ ఎస్సై శ్రీధర్ చెప్పారు. ఈ కేసులో మిగతా ముద్దాయిలు 12 మంది పరారీలో ఉన్నారన్నారు. వారిని పట్టుకోవడం కోసం ఎస్సై ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News November 2, 2025

MHBD: 22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు!

image

22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు. MHBD MPPS జమాండ్లపల్లి, ఈదులపుసపల్లి, గడ్డి గూడెం, దంతాలపల్లి-గున్నేపల్లి, లక్ష్మిపురం, నెల్లికుదురు-మునిగలవీడు, గూడూరు-అయోధ్యపురం, లక్ష్మిపురం, తొర్రూర్-వెలికట్ట, వెంకటాపురం, అమ్మాపురం, సీరోల్-కాంపల్లి, తాళ్లసంకీస, నర్సింహులపేట-బోడ్కాతండా, గార్ల-చినకిష్టాపురం, కురవి-గుండ్రతిమడుగు, హరిదాస్ తాండ, కేసముద్రం-కల్వల, బోడగుట్ట తాండ, చిన్నగూడూర్ జయ్యారంలో ఉన్నాయి.

News November 2, 2025

మెదక్: 3న విద్యుత్ సమస్యలు చెప్పుకోండి: ఎస్ఈ

image

మెదక్​ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్సూమర్స్​ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్​ఈ నారాయణ నాయక్​ తెలిపారు. మెదక్​ జిల్లాలో రైతులు, గృహావసర విద్యుత్ వినియోగదారులకు ధీర్ఘకాలికంగా విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా, మీటర్లు, అధిక బిల్లులు వచ్చినా, రైతులకు ట్రాన్స్​ఫార్మర్లకు కానీ, విద్యుత్ వైర్లకు సంబంధించి నేరుగా వచ్చి చెప్పాలని కోరారు.