News January 12, 2026
సిరిసిల్ల: ప్రజావాణికి 122 దరఖాస్తుల స్వీకరణ

సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమానికి బాధితుల నుంచి 122 దరఖాస్తులు వచ్చాయి. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 7, 2026
బాపట్ల: ‘ఆ ఆదేశాలు చెల్లుబాటు కావు’

బాపట్ల జిల్లాలో అనుమతి లేకుండా జారీ చేసిన డిప్యూటేషన్ ఆదేశాలు చెల్లుబాటుకావని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్వర్ణ అవార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగుల డిప్యూటేషన్లపై సమగ్రంగా ఆరా తీశారు. వివిధ శాఖల్లో అనుమతితో లేదా అనుమతి లేకుండా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, ఆర్డర్ కాపీలు సేకరించాలని ఆదేశించారు.
News February 7, 2026
సంగారెడ్డి: ఎన్నికల ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల అభ్యంతరాలు, సమాచారం కోసం 81253 52721 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కేంద్రం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని, వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందిస్తారని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికలకు ఓటర్లు, అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News February 7, 2026
జనగామ: పులి కనిపిస్తే ఫొటోలు తీయొద్దు!

జిల్లాలో పులి సంచరిస్తున్నందున ఎవరికైనా పులి కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఫొటోలు గానీ, పులిని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలు చేయొద్దని అటవీ శాఖ అధికారి కొండల్ రెడ్డి సూచించారు. పులి కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని సూచించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలనుకుంటే 9603780678, 7382619411, 8121316323 నంబర్లను సంప్రదించాలని కోరారు.


