News September 15, 2025
సిరిసిల్ల: ప్రజావాణిలో 185 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలేక్టరేట్‌లో ఆయన ప్రజల నుంచి మొత్తం 185 దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు 61, డీఆర్డీఏకు 44, హౌసింగ్‌కు 25, ఉపాధి కల్పన కార్యాలయం, ఎన్డీసీలకు 8 చొప్పున, విద్యా శాఖ, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 6 చొప్పున దరఖాస్తులు అందాయి.
Similar News
News September 15, 2025
సిరిసిల్లలో ఘనంగా ఇంజినీర్స్ డే

భారతరత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంజినీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
News September 15, 2025
రొంపిచర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన విజయ్ కుమార్ అతని భార్య రాజేశ్వరితో కలిసి బైక్‌పై తిరుపతికి వెళుతుండగా రొంపిచర్లకు చెందిన మహమ్మద్ గౌస్ పీర్ బైక్‌పై వస్తూ ఆదర్శ పాఠశాల సమీపంలో ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మహమ్మద్ గౌస్ పీర్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 15, 2025
MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్‌టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.