News March 27, 2025
సిరిసిల్ల: ‘ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టవద్దు’

ప్రజావాణిలో వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టవద్దని ప్రజా భవన్ నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ ఆదేశించారు. ప్రజా భవన్ ప్రజావాణి దరఖాస్తులు, ఎన్ బీఎఫ్ఎస్ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పాల్గొన్నారు.
Similar News
News March 30, 2025
నిర్మల్: ఉగాది వేడుకల్లో మాజీ మంత్రి

నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఉగాది వేడుకలను ధనరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జానపద జాతర సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక జానపద పాటలు, నృత్యాలు విశేషంగా అలరించాయి. రేలారే రేలా ఫెమ్ రవి బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News March 30, 2025
జాతర గోడపత్రుల ఆవిష్కరించిన ASF ఎమ్మెల్యే

రెబ్బెన మండలం ఇందిరానగర్‌లో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 12, 13న జరిగే మహంకాళి అమ్మవారి జాతర పోస్టర్లను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ మాట్లాడుతూ.. కొమరం భీం జిల్లా భక్తుల కొంగు బంగారంగా ఉన్న కనకదుర్గమ్మ దేవి జాతరకు భక్తులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
News March 30, 2025
పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే

మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.