News September 11, 2025
సిరిసిల్ల: ‘ప్రతి గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా చేయాలి’

ప్రతి గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా చేయాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు, మండల ప్రజా పరిషత్ అధికారులతో గురువారం ఆమె సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు టీబీపై అపోహలు తొలగిస్తూ వ్యాధి సోకకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాలన్నారు.
Similar News
News March 11, 2026
ఖమ్మం: వెలుగుమట్ల నిరాశ్రయులకు తీపికబురు

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ నిరాశ్రయులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 412 మందిని అర్హులుగా గుర్తించి, వీరిలో 311 మందికి బుధవారం ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనుంది. మిగిలిన 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటికే రెవెన్యూ అధికారులు అర్హులైన బాధితులకు టోకెన్లు జారీ చేశారు.
News March 11, 2026
NTR: PG విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో పీజీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నానో టెక్నాలజీ మినహా మిగతా కోర్సుల పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1లోపు రూ.100 ఫైన్‌తో 2లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
News March 11, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


